చంద్రబాబు జైలు శిక్ష ఫై KA పాల్ కీలక వ్యాఖ్యలు

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయినా చంద్రబాబు ఫై ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేసారు. దేశంలో అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు అని , ఆరు లక్షల కోట్ల అవినీతికి చంద్రబాబు పాల్పడ్డారని , చంద్రబాబు అవినీతి ఆకాశమంత ఎత్తుకు చేరుకుందన్నారు.

తండ్రి అవినీతిలో కొడుకు నారా లోకేశ్‌కు కూడా భాగస్వామ్యం ఉందన్నారు. లక్షల కోట్ల అవినీతి చేసిన ఆయన జైలు శిక్ష అనుభవించాల్సిందే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంటే విచారణకు సహకరించాలని సూచించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అచ్చెన్నాయుడిని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పాల్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.