నాలుగో దశ లాక్‌డౌన్‌ వివరాలను తెలుపనున్న కేంద్రం

ఈ రోజు సాయంత్రం లాక్‌డౌన్ నూతన మార్గదర్శకాలను ప్రకటించనున్న కేంద్ర

నాలుగో దశ లాక్‌డౌన్‌ వివరాలను తెలుపనున్న కేంద్రం
Lockdown, COVID-19

న్యూఢిల్లీ: కరోనా నియంత్రణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విధించిన మూడో దశ లాక్‌డౌన్‌ రేపటితో ముగియనున్నది. అయితే ఈక్రమంలోనే నాలుగో దశ లాక్‌డౌన్‌ విధించి, మినహాయింపులకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం ఈరోజు సాయంత్రం విడుదల చేయనుంది.
దేశంలో కరోనా విజృంభణ అధికంగా ఉన్న రెడ్‌జోన్లలో తప్ప మిగతా ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా రవాణా వ్యవస్థకు సడలింపులు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థిక, వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలకు మరిన్ని సడలింపులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/