లేని తండ్రి కోసం కుమారుడు ఏంచేసాడో తెలుసా..?

నేటి సమాజంలో తల్లిదండ్రుల మీద ప్రేమ అనేది తగ్గిపోయింది. కనీసం వారికీ పట్టెడు అన్నం కూడా పెట్టడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో ఉంచుకోలేక ఓల్డ్ ఏజ్ హోమ్ కు తరలిస్తున్నారు. ఇలాంటి ఈ తరుణంలో చనిపోయిన నాన్న కోసం ఓ కుమారుడు తండ్రి విగ్రహాన్ని పెట్టుకొని పూజలు చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి తన తండ్రి మరణించిన, ఆయన రూపాన్ని ప్రతిరోజు చూడాలనే కోరికతో తన తండ్రి విగ్రహాన్ని ఏకంగా తన ఇంటి ఎదుటే నిర్మించుకున్నాడు. ప్రతిరోజు తండ్రి (కొమరయ్య) రూపాన్ని విగ్రహంలో చూస్తూ సంతోష పడుతున్నాడు. మూడు సంవత్సరాల క్రితం కొమరయ్య మరణించారు. కొమురయ్య ఒక్కగానొక్క కుమారుడు లక్ష్మణ్. తండ్రి కొమురయ్య మరణించిన ఆయన జ్ఞాపకాలు, రూపం ఎప్పుడు తన కళ్లెదుటే ఉండాలనే ఉద్దేశంతో లక్ష్మణ్ తండ్రి విగ్రహాన్ని ప్రత్యేకంగా చేయించుకోని తన ఇంటి ఎదుట ప్రతిష్టించు కున్నాడు. ఇది చూసేందుకు చుట్టుపక్కల గ్రామస్థులు తండోపతండాలుగా వస్తున్నారు.