నిఖత్ జరీన్‌కి సరికొత్త థార్‌ని అందించిన మహీంద్రా

Mahindra delivers All-New Thar to Nikhat Zareen


హైదరాబాద్ : భారతదేశపు ప్రముఖ SUV తయారీదారు , మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, 2023 IBA మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ లో ప్రతిష్టాత్మకమైన ‘మహీంద్రా ఎమర్జింగ్ బాక్సింగ్ ఐకాన్’ అవార్డు విజేత నిఖత్ జరీన్‌కు తన ప్రతిష్టాత్మక SUV పూర్తి సరికొత్త థార్‌ను అందజేసింది. నిష్ణాతురాలైన భారతీయ బాక్సర్, నిఖత్ జరీన్. రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా ఆకట్టుకునే ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉన్నారు. ఆమె ప్రయాణం 2009లో ప్రారంభమైంది, గౌరవనీయమైన ద్రోణాచార్య అవార్డు గ్రహీత IV రావు వద్ద శిక్షణ పొందేందుకు విశాఖపట్నంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఆమె నమోదు చేసుకున్నారు . 2010లో ఈరోడ్ నేషనల్స్‌లో గోల్డెన్ బెస్ట్ బాక్సర్‌గా ఆమె గుర్తింపు పొందారు.

నేహా ఆనంద్ – హెడ్, గ్లోబల్ బ్రాండ్ అండ్ మార్కెటింగ్ కమ్యూనికేషన్, ఆటోమోటివ్ డివిజన్ మాట్లాడుతూ “మహీంద్రా ఎమర్జింగ్ బాక్సింగ్ ఐకాన్‌గా ఆమె సాధించిన అద్భుతమైన విజయాన్ని పురస్కరించుకుని నిఖత్ జరీన్‌కి పూర్తి సరికొత్త థార్‌ను అందజేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆమె స్ఫూర్తిదాయకమైన ప్రయాణం, తమ కలలను నిర్భయంగా కొనసాగించేందుకు లెక్కలేనంత మంది యువతులను ప్రోత్సహిస్తుంది. మహిళల బాక్సింగ్‌కు మద్దతు ఇవ్వడం పట్ల మహీంద్రా గర్వంగా ఉంది మరియు నిఖత్ వంటి ప్రతిభావంతులైన క్రీడాకారిణులు నూతన శిఖరాలకు చేరుకుంటూ తమ కలలను సాకారం చేసుకోవడానికి మరియు అసాధ్యమైన వాటిని అన్వేషించడానికి స్ఫూర్తిని అందిస్తుంది ” అని ఆన్నారు.

నిఖత్ జరీన్ మరియు రగ్గడ్ మహీంద్రా థార్ ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకునే అద్భుతమైన లక్షణాలను కలిగి ఉన్నారు. బాక్సింగ్‌లో నిఖత్ యొక్క అసాధారణమైన వేగం మరియు ఖచ్చితత్వం, శక్తివంతమైన ఇంజన్ మరియు చురుకైన హ్యాండ్‌లింగ్‌తో విభిన్నమైన భూభాగాలపై థార్ యొక్క పరాక్రమంతో చక్కగా సరిపోలతాయి. తమ తమ రంగాలలో శక్తి, బహుముఖ ప్రజ్ఞ మరియు ఛాంపియన్ స్పిరిట్‌ను మూర్తీభవించడం తో పాటుగా అచంచలమైన సంకల్పం మరియు అనుకూలతకి ఉదాహరణ గా వీరు నిలుస్తారు. 2023 ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో అంతర్జాతీయ స్థాయిలో భారతీయ మహిళా బాక్సర్లు ఆధిపత్యం చెలాయించారు, ఎనిమిది మంది బాక్సర్లు క్వార్టర్ ఫైనల్స్‌లో మరియు నలుగురు పతక రౌండ్‌లకు అర్హత సాధించారు. 63 దేశాలు పోటీపడగా 4 బంగారు పతకాలు సాధించి పతకాల పట్టికలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. భారతీయ మహిళా బాక్సర్ల విజయం దేశంలో క్రీడ యొక్క ప్రొఫైల్‌ను పెంచడానికి సహాయపడింది.