మూడు రోజుల పాటు తెలంగాణాలో బిజెపి నేతలు బిజీ బిజీ..

తెలంగాణ ఎన్నికల ప్రచారానికి ఇంకా నాల్గు రోజుల సమయం మాత్రమే ఉండడం తో కాంగ్రెస్ , బిజెపి అగ్ర నేతలంతా తెలంగాణ లో పర్యటించబోతున్నారు. ఇప్పటికే రాహుల్ , ప్రియాంక , శివకుమార్ లకు సంబదించిన షెడ్యూల్ ఖరారుకాగా.. బీజేపీ అగ్ర నేతల సైతం మూడు రోజుల పాటు తెలంగాణ లో పర్యటించబోతున్నారు. 24, 25, 26 తేదీలలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరు జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్ వేర్వేరు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు వీరికి సంబదించిన షెడ్యూల్ ను విడుదల చేసారు.

అమిత్ షా ఎన్నికల ప్రచారం విషయానికి వస్తే..

నవంబర్ 24న(రేపు) మధ్యాహ్నం 12 గంటలకు ఆర్మూర్ లో జరుగునున్న సకల జనుల విజయ సంకల్ప సభలో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు రాజేంద్రనగర్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు శేర్లింగంపల్లి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు అంబర్పేట నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించనున్నారు.

నవంబర్ 25న(శనివారం) ఉదయం 11 గంటలకు కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సకల జనుల విజయసంకల్ప సభ బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 1 గంటలకు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో జరగనున్న సకల జనుల విజయసంకల్ప సభ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు పటాన్ చెరు నియోజకవర్గం సకల జనుల విజయ సంకల్ప సభ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఖైరతాబాద్ నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొంటారు.

నవంబర్ 26న(ఆదివారం) ఉదయం 11 గంటలకు మక్తల్ నియోజకవర్గంలో సకల జనుల విజయ సంకల్ప సభ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ములుగు నియోజకవర్గంలో సకల జనుల విజయసంకల్ప సభ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు భువనగిరి నియోజకవర్గంలో సకల జనుల విజయ సంకల్ప సభ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం 6 గంటలకు కూకట్ పల్లిలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. రాత్రి 8 గంటలకు ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు.

జేపీ నడ్డా ఎన్నికల ప్రచారం విషయానికి వస్తే..

ఈనెల 25న బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా మధ్యాహ్నం 2 గంటలకు హుజూర నగర్ నియోజకవర్గంలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొననున్నారు. సాయంత్రం 6 గంటలకు ముషీరాబాద్ నియోజకవర్గంలో రోడ్ షో అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు. రాత్రి 7 గంటలకు పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు.

రాజ్నాథ్ సింగ్ ఎన్నికల ప్రచారం విషయానికి వస్తే..

రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ 24న ఉదయం 11 గంటలకు మేడ్చల్, సాయంత్రం 4 గంటలకు కార్వాన్ నియోజకవర్గం, సాయంత్రం 5 గంటలకు కంటోన్మెంట్లో జరగనున్న బహిరంగ సభలలో ప్రసంగించనున్నారు.