అసెంబ్లీలో జగన్ మొసలి కన్నీరు: లోకేశ్

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం జగన్ మంగళవారం ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. గత ప్రభుత్వ వైఫల్యాలు , కేంద్రం విభజన అంశం , హైదరాబాద్ లేకపోవడం తో వచ్చిన నష్టం తదితర అంశాల ఫై స్పందిస్తూనే టిడిపి , జనసేన పార్టీల ఫై విమర్శలు , ఆరోపణలు చేసారు. అయితే జగన్ స్పీచ్ ఫై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెటైర్లు వేశారు.

తల్లిదండ్రులని చంపేసిన ముద్దాయి.. తాను అనాథనని, కరుణ చూపండి అని జడ్జి గారిని వేడుకున్నాడని చెప్పి.. సేమ్ టు సేమ్ ఇలాగే ఉంది జగన్ తీరు కూడా అలాగే ఉందంటూ లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పాలిట కల్పవృక్షం లాంటి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ ప్రజా రాజధాని అమరావతిని అంతం చేసిన జగన్.. ఏపీకి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి పవర్ హౌస్ కావాలంటూ అసెంబ్లీలో మొసలి కన్నీరు కారుస్తున్నాడని నారా లోకేష్ పేర్కొన్నారు.