శ్రీరామ నవమి సందర్బంగా రామబాణం నుండి సరికొత్త పోస్టర్ రిలీజ్

లక్ష్యం, లౌక్యం లాంటి రెండు హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్ డైరెక్షన్లో గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ రామబాణం. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం తాలూకా సరికొత్త పోస్టర్ ను ఈరోజు శ్రీరామనవమి సందర్బంగా రిలీజ్ చేసారు.

ఈ చిత్రంలో ఖుష్బూ సుందర్‌, జగపతిబాబు, సచిన్ ఖేడ్కర్‌, నాజర్‌, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిశోర్‌, సప్తగిరి, కాశీ విశ్వనాథ్‌, సత్య, గెటప్‌ శ్రీను, సమీర్‌, తరుణ్ అరోరా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. మే 05 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.