ట్రంప్ మద్దతు దారుల తీరును ఖండించిన జోబైడెన్
ప్రజాస్వామ్యం, చట్టసభ సభ్యులు ప్రమాదంలో అంటూ వ్యాఖ్య..

Washington: అమెరికా క్యాపిటల్ భవన్ వద్ద ట్రంప్ మద్దతు దారులు విధ్వంసానికి తెగబడడాన్ని అమెరికా ప్రెసిడెంట్ ఎలెక్ట్ జో బైడెన్ తీవ్రంగా ఖండించారు.
విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా పేర్కొన్నారు. ట్రంప్ కారణంగా ప్రజాస్వామ్యం, చట్టసభ సభ్యులు ప్రమాదంలో పడ్డారని వ్యాఖ్యానించారు.
కాగా వాషింగ్టన్లోని క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడిని భారత ప్రధాని మోడీ ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలకు తావులేదని పేర్కొన్నారు.
తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/