క్యాపిట‌ల్ దాడిని ‘బ్యూటిఫుల్ సైట్ ‘ గా చైనా అభివ‌ర్ణ‌న‌..

అమెరికాకు ‘డ్రాగన్ కంట్రీ’ చుర‌క‌!

China describes capital attack as a 'beautiful site'
China describes capital attack as a ‘beautiful site’

Beijing: అమెరికా క్యాపిట‌ల్ బిల్డింగ్ పై దాడిపై చైనా వినూత్నంగా స్పందించింది. ట్రంప్ మద్దతుదారుల క్యాపిటల్ ముట్టడిని ‘బ్యూటిఫుల్ సైట్ ‘ గా అభివర్ణించింది.

ఈ ఘటనలను 2019 లో హాంకాంగ్ లో నిరసనకారులు లెజిస్లేటివ్ కౌన్సిల్ కాంప్లెక్సును ఆక్రమించిన సంఘటనలతో పోల్చింది. ఈ మేరకు నాటి హాంకాంగ్ ప్రొటెస్ట్ దృశ్యాలను, తాజా అమెరికా అల్లర్లను గ్లోబల్ టైమ్స్ రెండు వేర్వేరు ఫొటోలుగా ప్రచురించింది.

హాంకాంగ్ ఘర్షణలను స్పీకర్ నాన్సీ పెలోసీ భద్రపరచుకోదగిన బ్యూటిఫుల్ సైట్ గా గత ఏడాది జూన్ లో పేర్కొన్నారని ఈ పత్రిక గుర్తు చేసింది. కానీ ఆ అల్లర్లు చాలావరకు శాంతియుతంగా జరిగాయని వెల్లడించింది.

ఇప్పుడు క్యాపిటల్ హిల్ లో జరిగిన ఘటనలను కూడా ఆమె ఇలాగే అభివర్ణిస్తారా అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.చైనాలోని కమ్యూనిస్ట్ యూత్ లీగ్ కూడా అమెరికా ఘటనలను వీబో వేదికపై బ్యూటిఫుల్ సైట్ గా అభివర్ణించింది.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/