జార్ఖండ్‌ ఆరోగ్యమంత్రికి కరోనా పాజిటివ్‌

Jharkhand Health Minister Banna Gupta

రాంచీ: ‌జార్ఖండ్ ఆరోగ్య‌శాఖ మంత్రి బ‌న్న గుప్తా క‌రోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఆయన మంగ‌ళ‌వారం రాత్రి ట్విటర్‌లో వెల్లడించారు. గ‌త వారం రోజుల్లో త‌నను క‌లిసిన‌వారు ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరారు. తాను క‌రోనా ప‌రీక్ష చేయించుకున్నాన‌ని, అందులో పాజిటివ్ వ‌చ్చింద‌ని తెలిపారు. క‌రోనా ల‌క్ష‌ణాలున్న‌ప్ప‌టికీ మంగ‌ళ‌వారం ఉద‌యం జ‌రిగిన మంత్రిమండ‌లి స‌మావేశానికి గుప్తా హాజ‌ర‌య్యారు. వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి బాద‌ల్ ప‌త్ర‌లేఖ్‌తో క‌లిసి ఆయ‌న కూర్చున్నారు. దీంతో ముఖ్య‌మంత్రి హేమంత్ సోరెన్‌తో స‌హా స‌మావేశానికి హాజ‌రైన అంద‌రు క్వారంటైన్ వెళ్లానున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/