హరిహర వీరమల్లు నుండి పవన్ తాజా లుక్ లీక్

హరిహర వీరమల్లు నుండి పవన్ కళ్యాణ్ తాజా లుక్ లీక్ అయ్యింది. డైరెక్టర్ క్రిష్ – పవన్ కళ్యాణ్ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం హరిహరవీరమల్లు. ఈ మూవీ మొదలుపెట్టి నెలలు గడుస్తున్నా సినిమా మాత్రం పూర్తి కావడం లేదు. జనసేన పార్టీ కార్య క్రమాలతో పవన్ బిజీ గా ఉండడం..మధ్య మధ్య లో వేరే సినిమాలు పూర్తి చేయడం తో హరిహర వీరమల్లు అలాగే ఉండిపోతుంది. ప్రస్తుతం ఇది పూర్తి చేసిన తర్వాతే మరో మూవీ అని పవన్ గట్టిగా ఫిక్స్ అయ్యాడు.

ప్ర‌స్తుతం రామో జీ ఫిల్మ్ సిటీలో మూవీ ఫైన‌ల్ షెడ్యూల్‌కి సంబంధించిన షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌హా 900 మంది టీమ్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాబిన్ హుడ్ త‌ర‌హా పాత్ర‌ను పోషిస్తున్నారు. తాజాగా ‘హ‌రి హ‌ర వీర మ‌ల్లు’ సినిమా సెట్స్ నుంచి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి సంబంధించిన ఫొటో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అందులో ప‌వ‌న్ పోరాట యోధుడిగా క‌నిపిస్తున్నారు. త‌న లుక్‌కి సంబంధించిన ఫొటో నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఇప్ప‌టికే రిలీజైన ప‌వ‌న్ లుక్ టీజ‌ర్ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను మ‌రింత పెంచగా..ఇప్పుడు ఈ లుక్ అభిమానులను మరింతగా ఆకట్టుకుంటుంది.

వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ సంద‌ర్భంగా ఏప్రిల్ 28న హ‌రి హ‌ర వీర మ‌ల్లు చిత్రాన్ని విడుద‌ల చేయ‌టానికి నిర్మాత ఎ.ఎం.ర‌త్నం ప్లాన్స్ చేసుకుంటున్నారు. ఈ మూవీ లో నిధి అగ‌ర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. బాలీవుడ్ న‌టులు అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ కీ రోల్స్ లో న‌టిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు ఎంఎం కీర‌వాణి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌.