ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో గవర్నర్‌ సమీక్ష

ఆసుపత్రుల్లో సరైన వైద్య సాయం అందడం లేదని గవర్నర్ కు ఫిర్యాదు

Governor Tamilisai Video Conference With Private Hospitals Management

హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ప్రైవేట్‌ ఆస్పత్రుల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గవర్నర్‌ సమీక్షిస్తున్నారు. కరోనా ఐసోలేషన్‌ సౌకర్యం ఉన్న ఆస్పత్రుల ప్రతినిధులతో తమిళిసై మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అలాగే కరోనా పరీక్షలు, చికిత్స, పేషెంట్ల బెడ్లు, ట్రీట్మెంట్ బిల్లులు, ప్రజలు తెలిపిన ఫిర్యాదులు తదితర అంశాలపై వారితో చర్చిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరుగుతోంది. గవర్నర్ తో భేటీ అయిన వారిలో బసవతారకం ఇండోఅమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, కిమ్స్, కేర్ ఆసుపత్రి, అపోలో, విరించి, కామినేని, సన్ షైన్, గ్లోబల్, మల్లారెడ్డి నారాయణ, యశోద, కాంటినెంటల్ ఆసుపత్రుల ప్రతినిధులు ఉన్నారు.
కాగా రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. మరోవైపు ప్రభుత్వం సరైన వైద్యం అందించడం లేదంటూ బాధితులు గవర్నర్‌కు మొర పెట్టుకున్నారు. బాధితులు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులతో సమావేశమయ్యారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/