విజయ్ దేవరకొండ ‘ఖుషి’ రిలీజ్ డేట్ వచ్చేసింది

విజయ్ దేవరకొండ – సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖుషి చిత్రాన్ని సెప్టెంబర్ 1 రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి ప్రేమ కథల్ని తెరకెక్కించిన శివ నిర్వాణ ఈసారి ‘ఖుషి’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వాస్తవానికి ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకోవాల్సి ఉండగా..మధ్యలో సమంత అనారోగ్యానికి గురి కావడం తో షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. రీసెంట్ గా సమంత అనారోగ్యం నుండి బయటపడడంతో మళ్లీ షూటింగ్ మొదలుపెట్టుకుంది.
ఈ క్రమంలో కొత్త అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ రిలీజ్ డేట్ తెలుపుతూ..సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. విజయ్ దేవరకొండ ఆఫీస్‌కు వెళ్తూ.. టెర్రస్‌పై పెట్‌ను ఎత్తుకొని ఉన్న సమంతకు బై చెప్తున్న స్టిల్ ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మూవీలో విజయ్, సామ్ ప్రయాణం సూపర్ కూల్‌గా ఉండబోతున్నట్టు తాజా లుక్‌తో చెబుతున్నాడు డైరెక్టర్. శివనిర్వాణ మజిలీ తర్వాత ఈ సినిమాలో కూడా మరోసారి అలాంటి ఎమోషన్స్ పెట్టబోతున్నాడా..? అనేది చూడాలంటున్నారు పోస్టర్ చూసిన సినీ జనాలు. సెప్టెంబర్ 1న సినిమా విడుదల కానున్నట్టు తెలియజేసింది మూవీ టీం.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో సచిన్ ఖడేకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కన్నడ యాక్టర్ జయరాం, శరణ్య ప్రదీప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.