కేసీఆర్ తో జనసేన సలహాదారు సమావేశం..పవన్ కు మరో షాక్ తగలబోతుందా…?

తెలంగాణ సీఎం కెసిఆర్ స్థాపించిన బిఆర్ఎస్ పార్టీ ని ఇతర రాష్ట్రాల్లో విస్తరింప చేసేందుకు పక్క ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని పలువురు నేతలతో సమావేశం కాగా..ఇక పక్క రాష్ట్రం ఏపీపై కూడా మరింత ఫోకస్ పెట్టారు. ముఖ్యముగా ఇప్పుడిప్పుడే ప్రాణం పోసుకుంటున్న జనసేన ఫై కేసీఆర్ కన్నేసినట్లు తెలుస్తుంది. జనసేన పార్టీ లోని కీలక నేతలను బిఆర్ఎస్ లోకి లాగేసుకుంటున్నారు. ఇప్పటికే తోట చంద్రశేఖర్ తో పాటు పలువుర్ని బిఆర్ఎస్ లోకి చేర్చుకోగా…తాజాగా జనసేన పార్టీ సలహాదారు, తమిళనాడు మాజీ సిఎస్ రామ్మోహన్ రావు సైతం త్వరలో బిఆర్ఎస్ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

నిన్న సీఎం కేసీఆర్ ను రామ్మోహన్ రావు కలవడం జరిగింది. బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, పార్థసారథి తదితర నేతలతో కలిసి బుధవారం ప్రగతి భవన్ కు వచ్చిన రామ్మోహన్ రావు, కేసీఆర్ తో భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ ను రామ్మోహన్ రావు మర్యాదపూర్వకంగా కలిశారని ఎమ్మెల్యే బాల్క సుమన్ ట్వీట్ చేశారు. ఈ సమావేశంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నిజంగా రామ్మోహన్ రావు బిఆర్ఎస్ లో చేరతారా..లేక పవన్ వెంట ఉంటారా అనేది చూడాలి.