వ్యాక్సిన్‌ మిమ్మల్ని బాహుబలిగా మారుస్తుంది: మోడీ

YouTube video
PM Modi’s remarks at the start of Monsoon Session of Parliament 2021

న్యూఢిల్లీ : వ‌ర్షాకాల స‌మావేశాల నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీ పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో మీడియాతో మాట్లాడారు. ప్ర‌తి ఒక్క‌రూ క‌నీసం ఒక డోసు వ్యాక్సిన్ తీసుకుని ఉంటార‌ని, ప్ర‌తి ఒక్క‌రూ కోవిడ్ నియ‌మావ‌ళిని పాటించాల‌ని, దేశ‌వ్యాప్తంగా 40 కోట్ల మంది కోవిడ్ టీకా తీసుకున్నార‌ని, వాళ్లంతా బాహుబ‌లులు అయిన‌ట్లు ఆయ‌న తెలిపారు. పార్ల‌మెంట్ స‌మావేశాలు స‌జావుగా సాగాల‌ని, ప్ర‌తి ఒక్క సీఎంతో తాను చ‌ర్చించాన‌న్నారు. ప్ర‌పంచం అంతా మ‌హ‌మ్మారితో స‌త‌మ‌తం అయ్యింద‌ని, పార్ల‌మెంట్‌లో ఈ అంశంపై అర్థ‌వంత‌మైన చ‌ర్చ జ‌ర‌గాల‌న్నారు. ప్ర‌తి ఒక పార్టీకి చెందిన ఎంపీలు అత్యంత క‌ఠిన‌మై ప్ర‌శ్న‌లు వేయాల‌ని, కానీ ఆ ప్ర‌శ్న‌ల‌కు ప్ర‌భుత్వం స‌మాధానం ఇచ్చేలా అనుమ‌తించాల‌ని ప్ర‌ధాని తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/