సంక్రాంతి రోజే తెలుగు రాష్ట్రాల్లో పరుగులు పెట్టబోతున్న వందే భారత్ రైలు

ఈ నెల 19 న తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ రైలు పరుగులు పెట్టబోతుందని అనుకున్నాం కానీ ఇప్పుడు సంక్రాంతి రోజు నుండే పరుగులుపెట్టబోతుంది. సంక్రాంతి పండగ నాడే ప్రధాని మోదీ సికింద్రాబాద్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించనున్నారు.. వర్చువల్‌గా. దేశ రాజధాని నుంచి ఆయన వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచే జెండా ఊపి- వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ను పట్టాలెక్కిస్తారు. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను కూడా వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

ఇదిలా ఉండగానే వైజాగ్ లో గుర్తుతెలియని వ్యక్తులు వందే భారత్ రైలు ఫై రాళ్ల దాడి చేసారు. ట్రయల్ రన్ ముగించుకుని విశాఖపట్నం రైల్వేస్టేషన్ నుంచి మర్రిపాలెంలోని కోచ్ మెయింటెనెన్స్ సెంటర్‌కు రైలు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు రైలు ఫై రాళ్ల దాడి చేసారు. ఈ ఘటనలో ఒక కోచ్ అద్దం దెబ్బతింది.

ఈ ఘటనకు సంబంధించి DRM అనుప్ మాట్లాడుతూ.. “ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు విశాఖపట్నం రైల్వేస్టేషన్ నుండి కోచింగ్ కాంప్లెక్స్‌కు వెళ్తున్న వందేభారత్ రైలును గుర్తుతెలియని సంఘవిద్రోహులు రాళ్లదాడి చేసారు. నిందితుల ఫై RPF కేసు నమోదు చేసింది.