తాగిన మత్తులో రచ్చ రచ్చ .. చివరకు ‘నో ఫ్లై’ జాబితాలోకి

బెంగళూరు-ఢిల్లీ ఎయిర్ ఏషియా విమానంలో ఓ ప్రయాణికుడు వీరంగం

Air Asia
Air Asia

New Delhi: చిత్తుగా తాగేసి విమానంలో రచ్చ రచ్చ చేసాడు. అంతేకాదు ఒంటిపై దుస్తులన్నీ విప్పేసి సిబ్బంది పట్ల అసభ్యంగా వ్యవహరించాడు. చివరకు నో ఫ్లై జాబితాలోకి ఎక్కాడు. వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరు-ఢిల్లీ ఎయిర్ ఏషియా విమానంలో ఓ ప్రయాణికుడు ఫుల్లుగా మద్యం తాగిన మత్తులో వీరంగం చేసాడు. ఈ తతంగా అంతా మొదట లైఫ్ జాకెట్స్ విషయంలో సిబ్బందితో గొడవకు దిగాడు. మద్యం మత్తులో దుస్తులు తీసేసి అమర్యాదగా ప్రవర్తించాడు. దీంతో ఫ్లైట్ లోనే ప్రయాణికులు సహా సిబ్బంది అవాక్కయ్యారు ఈ ఘటన ఈ నెల 6న బెంగళూరు – ఢిల్లీ ఐ5-722 విమానంలో చోటుచేసుకుంది. ఎయిర్‌లైన్స్ ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు ఆ ప్రయాణికుడిపై కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుండగా ఎయిర్ ఏషియా ఆ వ్యక్తిని నో ఫ్లై జాబితాలో చేర్చింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/