పురుగుల అన్నం పెడుతున్నారంటూ.. మల్లారెడ్డి కాలేజీలో విద్యార్థినుల ఆందోళన

హైదరాబాద్ శివారు గండిమైసమ్మలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ క్యాంపస్లో విద్యార్థినులు నిరసనకు దిగారు. నిన్న రాత్రి అన్నం, స్వీటులో పురుగులు వచ్చాయని పేర్కొంటూ క్యాంపస్ ఆవరణలో ఆందోళన చేపట్టారు. యాజమాన్యం నాణ్యమైన ఆహారం పెట్టాలంటూ ‘వీ వాంట్ జస్టిస్’ అని నినాదాలు చేశారు. ఇటీవల కూడా అన్నంలో పురుగులు వచ్చాయని స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు.

ఇదిలా ఉంటె రెండు రోజుల క్రితం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండీఏ లేఅవుట్‌లో మల్లారెడ్డి కాలేజీ కోసం వేసుకున్న రోడ్డును తొలగించారు. హెచ్ఎండీఏ ఉన్నతాధికారుల ఆదేశంతో జేసీబీ సాయంతో రోడ్డును తొలగించారు. అయితే రేవంత్ రెడ్డి ఫిర్యాదుపై గతంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోగా.. ఇప్పుడు రేవంత్ నేతృత్వంలోని ప్రభుత్వంలో చర్యలు తీసుకోవడం విశేషం.