రక్తాన్ని చెమటగా మార్చి బుక్కెడు బువ్వ పెట్టే రైతు చేతికి సంకెళ్లా?: రేవంత్ రెడ్డి

భూకబ్జాలు చేసే బిఆర్ఎస్ గద్దలపై కేసులు ఉండవంటూ ఫైర్

tpcc-chief-revanth-reddy

హైదరాబాద్‌ః తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఇటీవల మంత్రి జగదీశ్ రెడ్డి కాన్వాయ్ ని అడ్డుకుని అరెస్టయిన రైతుల చేతులకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకురావడంపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డలపై అకృత్యాలు చేసే దుర్మార్గులపై చర్యలు ఉండవంటూ ముఖ్యమంత్రిని దుయ్యబట్టారు. మత్తు పదార్థాల మాఫియాకు శిక్షలు ఉండవని విమర్శించారు. భూకబ్జాలు చేసే బిఆర్ఎస్ గద్దలపై కేసులు ఉండవని అన్నారు. తన రక్తాన్ని చెమటగా మార్చి బుక్కెడు బువ్వ పెట్టే రైతు చేతికి సంకెళ్లా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గు అనిపించడం లేదా కేసీఆర్? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.