విషాదం నింపిన అమ్మఒడి డబ్బు

చిత్తూరు: ఏపిలో సంక్రాంతి పండుగ పూట అమ్మఒడి డబ్బు ఓ కుటుంబంలో విషాదం నింపింది. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం నేతిగుండ్లపల్లి గ్రామంలో అమ్మఒడి డబ్బుల విషయంలో ఓ కుటంబంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం ఉదయం అమ్మ ఒడి డబ్బుల కోసం భార్యాభర్తలిద్దరూ ఘర్షణ పడ్డారు. దీంతో మాట మాటపెరిగి భార్య ఆదిలక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదిలక్ష్మి మృతి చెందింది. పండగపూట ఇంట్లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/