నేడు మంత్రి పేర్ని నానితో రామ్ గోపాల్ వర్మ భేటీ

మధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు భేటీ

అమరావతి : ఏపీలోని సినిమా టికెట్ల ధ‌ర‌ల త‌గ్గింపుపై వివాదాస్ప‌ద‌ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవ‌ల తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఏపీ మంత్రి పేర్ని నాని కూడా స‌మాధానం ఇచ్చారు. టికెట్ల ధ‌ర‌ల త‌గ్గింపుపై నేరుగా చ‌ర్చించ‌డానికి సిద్ధ‌మ‌ని ఆర్జీవీ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. దీంతో ఏపీ ప్రభుత్వం నుంచి ఆయ‌న‌కు ఆహ్వానం అందింది.

సినిమా టికెట్ల ధ‌ర‌ల‌ వివాదంపై త‌మ‌తో సమావేశానికి రావాలంటూ పేర్ని నాని నుంచి ఆహ్వానం అందడంతో ఈ రోజు హైద‌రాబాద్ నుంచి అమరావతి సచివాలయానికి ఆర్జీవీ వెళ్తున్నారు. సచివాలయంలో ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు ఇరువురు భేటీ కానున్నారు. కాసేప‌ట్లో ఆర్జీవీ గన్నవరం విమానాశ్ర‌యం చేరుకోనున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా అమరావతి సచివాలయానికి వెళ్తారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/