తెలంగాణ లో ఎన్నికల్లో జనసేన 9 స్థానాల్లో పోటీ

తెలంగాణ ఎన్నికల్లో జనసేన – బిజెపి కలిసి బరిలోకి దిగబోతున్నాయి. జనసేన పార్టీ 9 స్థానాల్లో పోటీ చేయబోతుంది. ఈ మేరకు ఒప్పందం కుదిరింది. శనివారం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి తో పాటు ఎంపీ లక్ష్మణ్ లు పవన్ కళ్యాణ్ తో సమావేశం అయ్యారు. ఎన్నికలకు సంబదించిన పొత్తు గురించి మాట్లాడి..ఫైనల్ గా 9 స్థానాల్లో పోటీకి పవన్ తో ఓకే చేయించారు. మొదట జనసేన 11 చోట్ల పోటీ చేయాలని నిర్ణయించినా తాజా చర్చల్లో 9 స్థానాలకు అంగీకరించింది.

కూకట్‌పల్లితోపాటు మరో ఎనిమిది స్థానాల్లో జనసేన పోటీ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికల్లో రెండు పార్టీల అభ్యర్థుల విజయానికి సమష్టిగా పనిచేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఏయే స్థానాల్లో జనసేన పోటీ చేయనుందనే అంశంతోపాటు తదుపరి కార్యాచరణను ఈరోజు వెల్లడించనున్నారు. అలాగే ఈ నెల 7న హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో జరగబోయే బీసీ ఆత్మగౌరవ సభకు పవన్‌కల్యాణ్‌ హాజరు కానున్నారు. ప్రధాని సభలో పాల్గొనాలని పవన్‌కల్యాణ్‌ను కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌లు కోరగా.. అందుకు ఆయన అంగీకరించారు.