ముంబయిలో కరోనా ఉద్ధృతి

ముంబయిలో ఇప్పటి వరకు 24,118 కేసులు నమోదు.. 841 మంది మృతి

corona virus
corona virus

ముంబయి: కరోనా మహమ్మారి కేసులు మహారాష్ట్రలో అధికంగా నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు అక్కడ 39,297 కేసులు నమోదు కాగా, 1,390 మంది మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఇలా ఉంటే దేశ ఆర్థిక రాజధాని ముంబయి లోనే ఇప్పటి వరకు 24,118 కేసులు నమోదు కాగా, 841 మంది మరణించారు. అంటే రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసులు, మరణాల్లో దాదాపు సగం ఇక్కడే వెలుగుచూస్తుండడం ప్రభుత్వాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే ముంబయి మరో న్యూయార్క్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కేసుల్లో 21 శాతం ముంబయి లోనే నమోదవుతుండడమే ఇందుకు కారణం. కరోనా కట్టడికి మహారాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసుల ఉద్ధృతి మాత్రం తగ్గడం లేదు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/