17,18 తేదీల్లో ‘జనసేన’ క్రియాశీలక సమావేశాలు

హాజరుకానున్న అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌

Pawan Kalyan
Pawan Kalyan

Amaravati: జనసేన పార్టీ క్రియాశీలక సమావేశాలు ఈనెల 17,18 తేదీల్లో మంగళగిరి లో జరగనున్నాయని ప్రకటించారు.

రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు ప్రధానంశంగా ఉంటాయి.. 17న ఉదయం ఇచ్చాపురం, రాజోలు, మంగళగిరి, నెల్లూరు రూరల్‌, అనంతపురం నియోజకవర్గాల నేతతో అధ్యక్షుడు సమీక్ష చేయనున్నారు.

మధ్యాహ్నం నుంచి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ముఖ్యనేతలతో భేటీ కానున్నారు.. 18న ఉదయం అమరావతి పోరాట సమితి నేతలు, అమరావతికి చెందిన మహిళా రైతులతో పవన్‌కల్యాణ్‌ భేటీ అవుతారు.

ఈ సమావేశాల్లోనే 32 నియోజకవర్గాలకు సంబంధించి క్రియాశీల సభ్యత్వం ప్రారంభం కానుంది. 18న ఉదయం ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జిలతో సమావేశం నిర్వహిస్తారు..

తాజా ఆధ్యాత్మికం వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/devotional/