ఉజ్వల రాజకీయ భవిష్యత్తు ఉంటుందనుకున్నాం
పుత్రశోకం నుంచి కోలుకునే మనోధైర్యాన్ని మాగంటికి ప్రసాదించాలని కోరుకుంటున్నాను.. చంద్రబాబు
tdp-chandrababu-fires-on-ap-govt
అమరావతి: టీడీపీ సీనియర్ నేత మాగంటి వెంకటేశ్వరరావు కుమారుడు మాగంటి రాంజీ మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ‘మాగంటి రాంజీ టీడీపీకార్యక్రమాలలో ఎంతో చురుకుగా పాల్గొంటూ ఉంటే.. ఉజ్వల రాజకీయ భవిష్యత్తు ఉంటుందనుకున్నాం. అలాంటిది చాలా చిన్న వయసులో ఇలా అర్థాంతరంగా అందరికీ దూరమైపోవడం బాధాకరం. పార్టీకి తీరని లోటు’ అని చంద్రబాబు చెప్పారు.
‘పుత్రశోకం నుంచి త్వరగా కోలుకునే మనోధైర్యాన్ని మాగంటి వెంకటేశ్వరరావుగారికి ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/