జగన్ విధానాలు దేశానికే ఆదర్శం

కరోనా మరణాలు ఏపిలో అత్యల్పం అన్న విజయసాయి

vijaya sai reddy
vijaya sai reddy

అమరావతి: ఏపిలో గత కొన్నిరోజులుగా కరోనా ఉద్ధృతి తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మరణాల సంఖ్య తగ్గడమే కాదు, కొత్త కేసుల తీవ్రత కూడా మునుపటిస్థాయిలో లేదు. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. కొవిడ్19 నియంత్రణలో ఏపి, తమిళనాడు రాష్ట్రాలు భేష్ అని కాలిఫోర్నియా యూనివర్సిటీ తేల్చిందని వెల్లడించారు. దేశంలో కరోనా మరణాల శాతం ఏపీలోనే తక్కువ అని వివరించారు. టెస్టింగ్, ట్రేసింగ్ విధానం వల్లే ఇది సాధ్యమైందని విజయసాయి తెలిపారు. సీఎం జగన్ అనుసరిస్తున్న ఆరోగ్య విధానాలు దేశానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/