రేపే “జగనన్న చేదోడు పథకం” నిధులు విడుదల

ఏపీ ప్రజలకు తీపి కబురు..రేపు మూడోవిడుత “జగనన్న చేదోడు పథకం” నిధులను విడుదల చేయబోతున్నారు. ఈ పథకం కింద దర్జీలు, రజకులు, నాయి బ్రాహ్మణులకు ఒక్కొక్కరికి రూ. 10,000 చొప్పున సాయాన్ని ప్రభుత్వం ఇస్తోంది. పాత లబ్ధిదారులు, కొత్తగా దరఖాస్తు చేసిన వారు కుల, ఇన్కమ్, లేబర్ సర్టిఫికెట్ ను సమర్పించడానికి జనవరి 26 వరకే సమయం ఇవ్వగా, మొన్న సెలవు కావడంతో చాలా మంది ఇవ్వలేకపోయారు. ఇక వీటి దరఖాస్తు సమయం ముగియండంతో… రేపు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయబోతుంది ప్రభుత్వం.

రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు అవసరమైన చేతి పనిముట్లు, వారికి పెట్టుబడి కోసం జగనన్న చేదోడు స్కీమ్ కింద ప్రతి సంవత్సరం రూ.10 వేల సహాయం అందిస్తుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితాలు ప్రదర్శించారు. గతేడాది కూడా అర్హులు ఎవరికైనా డబ్బులు రాకపోతే వారు గ్రామ సచివాలయానికి వెళ్లి అన్ని వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వెంటనే తనిఖీ ప్రక్రియ చేసి అర్హత ఉంటే డబ్బులు చెల్లిస్తారు.