జగన్ ఢిల్లీ టూర్ ఫై నారా లోకేష్ సెటైర్లు

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ ఫై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెటైర్లు వేశారు. గురువారం రాత్రి సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతుండటంతో ఢిల్లీలో ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు మరికొందరు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. ఏపీలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మచిలీపట్నం పోర్టు శంకుస్థాపనకు ప్రధానిని ఆహ్వానించనున్నారని సమాచారం. అలాగే పోలవరం నిధుల పైన ప్రధానితో చర్చ జరిపే అవకాశం ఉంది. ప్రధాని సమావేశం అనంతరం అమిత్ షా, కేంద్ర జలశక్తి మంత్రిలో జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై వినతి పత్రాలను వారికీ జగన్ ఇవ్వనున్నారు.

కాగా జగన్ ఢిల్లీ టూర్ ఫై ఈ టూర్‌ పై టీడీపీ నేత నారా లోకేష్ సెటైర్లు విసిరారు. అయిన‌నూ పోయి రావ‌లె హ‌స్తిన‌కు అని జ‌గ‌న్ రెడ్డి మ‌రోసారి ఢిల్లీ ఎందుకెళ్తున్న‌ట్టు? అంటూ చురకలు అంటించారు. ఒక క‌న్నుని పొడిచిన మ‌రో క‌న్నుని కాపాడ‌టానికి… సీబీఐ అధికారి బ‌దిలీ కోసమా… లిక్క‌ర్ స్కాంలో బుక్క‌యిన ఎంపీ కోసమా ? అని ఆగ్రహం వ్యక్తం చేసారు.