మరో టీడీపీ నేతకు గుండెపోటు..

టీడీపీ పార్టీలో వరుస సంఘటనలు కలవరపెడుతున్నాయి. మొన్నటికి మొన్న లోకేష్ పాదయాత్ర లో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురై ..ప్రస్తుతం బెంగుళూర్ లోని నారాయణ హృదయాలయ హాస్పటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈయన ఆరోగ్యం పట్ల యావత్ టీడీపీ శ్రేణులు ఖంగారుపడుతుండగా..ఇప్పుడు మరో నేత గుండెపోటుకు గురయ్యారు.

టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు గుండెపోటుకు గురయ్యారు. ఈ తెల్లవారుజామున గుండుపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆయనను విజయవాడలోని రమేశ్ ఆసుపత్రికి తరలించారు. వెంటనే చికిత్స ప్రారంభించిన డాక్టర్స్ పరీక్షల అనంతరం స్టెంట్ వేశారు. అర్జునుడికి బీపీ ఎక్కువగా ఉన్నట్టు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్టు చెపుతున్నారు. అర్జునుడు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలుసుకున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి బచ్చుల ఆరోగ్యంపై ఆరా తీశారు. డాక్టర్స్ తో మాట్లాడి అర్జునుడు ఆరోగ్యం ఫై గురించి అడిగి తెలుసుకున్నారు. మరోపక్క అర్జునుడు హాస్పటల్ లో చేరిన విషయం తెలిసి పెద్ద ఎత్తున పార్టీ కార్య కర్తలు , నేతలు హాస్పటల్ కు చేరుకుంటున్నారు.