వీఆర్‌వోల వద్దనున్న రెవెన్యూ రికార్డుల స్వాధీనం?

సోమేశ్‌ కుమార్ ఆదేశాలు జారీ?

cm kcr

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలోని వీఆర్‌వోల వద్దనున్న రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్ సంబంధిత‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకల్లా ఈ ప్ర‌క్రియ పూర్తి కావాల‌ని ఆయ‌న చెప్పారు. అలాగే, సాయత్రం 5 గంటలలోపు.. రికార్డుల స్వాధీనంపై నివేదికలు ఇవ్వాలని తెలిపారు. ఈ మేర‌కు సోమేశ్ కుమార్ అన్ని చ‌ర్య‌లూ తీసుకున్నారు. గ్రామ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా కొన్ని వారాల క్రిత‌మే తెలిపారు. రైతులు భూములు సాగు చేసుకుంటున్నా వారి పేర్లు రికార్డుల్లోకి ఎక్కడం లేదని ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. పట్టాదారు పాస్‌పుస్తకాలు రాక, ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాలు పొందలేక రైతులు నష్టపోతున్నారని చెప్పారు. దీనికి వీఆర్‌వోలే కారణమని, ఆ వ్యవస్థను రద్దు చేస్తామని అన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/