రేపు కాకినాడలో సీఎం జగన్ పర్యటన..

jagan will visit gollaprolu kakinada district

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రేపు కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పర్యటించనున్నారు. వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం మూడో విడత సహాయాన్ని విడుదల చేయబోతున్నారు. రేపు ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న జగన్.. ఉదయం 10.30 గంటలకు గొల్లప్రోలు చేరుకోనున్నారు. 10.45 గంటలకు బహిరంగ సభలో పాల్గొని.. వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం సహాయం విడుదల చేస్తారు. మధ్యాహ్నం 12.40 గంటకు అక్కడినుంచి తిరుగు పయనం కానున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.

కాపు సామాజికవర్గానికి చెందిన 45 నుంచి 60 ఏళ్ల లోపున్న మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15వేల చొప్పున ఇస్తున్న సంగతి తెలిసిందే. ఏటా సగటున 3.2లక్షల మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధిపొందుతున్నారు. కాపు నేస్తం కోసం ప్రభుత్వం సుమారు రూ.490 కోట్లు వెచ్చిస్తోంది. ప్రభుత్వం కాపు సామాజిక వర్గానికి చెందిన ఉప కులాలైన కాపు, బలిజ, ఒంటరి, తెలగ వర్గాలకు చెందిన 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకు ఆర్జిక సహాయాన్ని అందిస్తోంది.అర్హులైన కాపు మహిళలకు ఏడాదికి రూ.15,000/- వేల రూపాయల ఆర్దిక సహాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది.