చీకోటి వ్యవహారంపై మాజీ మంత్రి కొడాలి నాని కామెంట్స్

చీకోటి ప్రవీణ్‌ పేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది. సాధారణ పేకాట స్థావరాలను నడిపించే ప్రవీణ్..ఇప్పుడు దేశ , విదేశాల్లో క్యాసినోలను నిర్వహించే స్థాయికి చేరాడు. అతి కొద్దీ ఏళ్లలోనే వందల కోట్లను సంపాదించాడు. దీంతో ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసారు. ఇదిలా ఉంటె చికోటి ప్రవీణ్ కు వైస్సార్సీపీ నేతలకు సంబంధం ఉన్నట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గత సంక్రాంతి పండుగ సందర్బంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ నేతృత్వంలో గుడివాడలో చికోటీ ప్రవీణ్ క్యాసినో నిర్వహించి ప్రజలను నిలువు దోపిడి చేశారని ఆరోపించారు.

ఈ తరుణంలో టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను మాజీ మంత్రి కొడాలి నాని ఖండించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చీకోటి వ్యవహారాన్ని తమపై ఆపాదించడం సరికాదన్నారు. టీడీపీ నేతలకు దమ్ముంటే తనను ఈడీతో అరెస్ట్‌ చేయించాలని సవాల్‌ విసిరారు. గుడివాడిలో జూదం అంటూ వచ్చిన టీడీపీ నిజనిర్థారణ కమిటీ నివేదిక ఈడీకి ఇవ్వాలని కొడాలి నాని డిమాండ్‌ చేశారు. దేశంలో ఏం జరిగినా.. చంద్రబాబు భజన బృందం తమకు ముడిపెడుతున్నారని ఆయన మండిపడ్డారు.