దేశంలో భారీగా పెరిగిపోతున్న కరోనా కేసులు
కొత్తగా మరో 1,718 కేసులు

- 4 గంటల్లో 67 మంది మృతి
- మొత్తం కేసుల సంఖ్య 33,050
- మొత్తం మృతులు 1,074
- కోలుకున్న 8,324 మంది
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 1,718 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 67 మంది ప్రాణాలు కోల్పోయారు.
కొత్త కేసులతో కలిపి దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 33,050కు చేరగా, ఇప్పటివరకు మొత్తం 1,074 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.
ఇప్పటి వరకు కరోనా నుంచి 8,324 మంది కోలుకున్నారని చెప్పింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 23,651 మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది.
ఇప్పటివరకు 8,324 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసుల సంఖ్య 9,915కి చేరింది. ఆ తరువాత గుజరాత్‌లో 4,082 మందికి కరోనా సోకింది. గుజరాత్‌లో 3,439 మందికి కరోనా సోకింది.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/