నవరత్నాలపై జగన్‌ సమాధానం చెప్పాలిః నాగబాబు

సంక్షేమ పథకాలకు పవన్ వ్యతిరేకం కాదని ప్రకటన

Nagababu

అమరావతిః సిఎం జగన్‌ అమలు చేస్తున్ననవరత్నాలపై జనసేన అధ్యక్షడు పవన్ కల్యాణ్ లేవనెత్తిన నవ సందేహాలకు సమాధానం చెప్పాలని జనసేన పీఏసీ సభ్యుడు కొణిదెల నాగబాబు డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలకు జనసేన వ్యతిరేకం కాదన్నారు. ప్రతి పేద కుటుంబానికి రూ. పది లక్షల విలువైన సహాయం అందజేస్తామని పవన్ కల్యాణ్ చెప్పారని తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

ప్రజలపై మోయలేని భారం వేస్తూ వసూలు చేస్తున్న పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని వైసీపీ దోచుకుంటోందని నాగబాబు విమర్శించారు. జనసేన కేంద్ర కార్యాలయంలో కృష్ణా, చిత్తూరు, తూర్పు గోదావరి ఉమ్మడి జిల్లాలకు చెందిన పార్టీ శ్రేణులతో నాగబాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం నవరత్నాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న తీరును, ప్రజా ధనాన్ని దోచుకుంటున్న విధానాన్ని పార్టీ శ్రేణులు నాగబాబు దృష్టికి తీసుకొచ్చాయని జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది.

ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో వైఎస్‌ఆర్‌సిపి నాయకత్వం ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించిందని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడం సాధ్యం కాదని తెలిసి ఇప్పుడు రకరకాల సాకులతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/