ఇంటి నుంచి పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స!

రాజీనామా చేయాలంటూ గొటబాయ నివాసంలోకి చొక్కుకుపోయిన ఆందోళనకారులు

Sri Lanka President Gotabaya Rajapaksa flees as protesters surround home: Report

కొలంబోః శ్రీలంక ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాల్చినవేళ ప్రజాందోళనలు మరింత ఉద్ధృతమయ్యాయి. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే దేశం వదిలి పారిపోయాడు. రాజపక్సే రాజీనామా చేయాలంటూ శ్రీలంకలో భారీగా ఆందోళనలు చేపట్టారు. రాజపక్సే ఇంటిని ఆందోళనకారులు భారీగా చుట్టుముట్టారు. జనానికి దొరికితే చంపేస్తారేమోననే భయంతో పరారయ్యాడు. రాజపక్సే పరారీని శ్రీలంక సైన్య ధ్రువీకరించింది. గొటబాయ రాజపక్స సురక్షితంగా అక్కడి నుంచి వెళ్లిపోయారని రక్షణశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి చెప్పారు. 

గతంలో కూడా అప్పటి ప్రధాని మహింద రాజపక్స ఇంటిని ఆందోళనకారులు ముట్టడించటం వల్ల ఆయన కూడా ఇలాగే పారిపోయారు. శ్రీలంకలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ఆయన సోదరుడు మహింద రాజపక్స కారణమని ప్రతిపక్షాలు, ప్రజలు ఆరోపిస్తున్నారు. విదేశీ మారక నిల్వలు అడుగంటడం వల్ల ఇంధనం, ఆహార ఉత్పత్తుల దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో ధరలు ఆకాశాన్నంటాయి. ఇంధన కొరత కారణంగా విద్యుత్తు కోతలు అమలు చేస్తున్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/