టిఫా స్కానింగ్‌ మిషన్లను ప్రారంభించిన హరీశ్‌రావు

తెలంగాణ లోని గర్భిణీలకు శుభవార్త. ఇక నుండి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఫ్రీ గా టిఫా స్కానింగ్‌ చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.20 కోట్ల వ్యయంతో 44 ప్రభుత్వ హాస్పిటళ్లలో 56 అత్యాధునిక టిఫా స్కానింగ్ మిషన్లు ఏర్పాటు చేసింది. వీటికి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ టిఫా స్కానింగ్‌ మిషన్లు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. 100 మందిలో ఏడుశాతం శిశువుల్లో లోపాలుంటాయని, వాటిని టీఫా స్కాన్స్‌తోనే గుర్తించడం సాధ్యమన్నారు. పేట్ల బురుజు ఆసుపత్రిలోనే కేసీఆర్‌ కిట్‌ పథకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారని, రాష్ట్రంలో 99.2శాతం ఇన్‌స్టిట్యూషనల్‌ డెలివరీలు జరిగాయన్నారు.

దీంతో తెలంగాణ ప్రభుత్వం నెలకు 20 వేల మంది గర్భిణులకు స్కానింగ్ చేసే వెసులుబాటు కలుగనుంది. ప్రైవేటులో రూ.2 నుంచి 3 వేలు ఖర్చయ్యే ఈ స్కానింగ్ ఇకపై ఉచితంగా సర్కారు దవాఖానల్లో చేయనున్నారు. ఈ స్కానింగ్‌ మిషన్ల ద్వారా తల్లిగర్భంలోని బిడ్డకు ఉన్న లోపాలను గర్భస్థ దశలోనే సులువుగా గుర్తించవచ్చని వైదుల్లు తెలిపారు. దీంతో దానికి అనుగుణంగా వైద్యం అందించేందుకు వీలుంటుందని చెప్పారు. టిఫా స్కాన్‌ను 18 నుంచి 22 వారాల మధ్యలో చేస్తారు.