దుబ్బాకలో 55.52 శాతం పోలింగ్

దుబ్బాక: దుబ్బాకలో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు 55.52 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక ఇప్పటికే పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకోగా పోలింగ్ శాతం పెరిగే అవకాశముందని చెబుతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు సాధారణ ఓట్లకు ఓటేసేందుకు అవకాశం ఇవ్వనున్నారు. చివరి గంటలో కొవిడ్ బాధితులకు ఓటేసేందుకు అవకాశం కల్పించనున్నారు. ఇక ఈ ఎన్నికలో 23 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరి భవితవ్యం ఈ నెల 10న తేలనుంది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/