పనితీరు బాగోలేని వారికి సీట్లు ఇవ్వలేనుః సిఎం కెసిఆర్‌

వచ్చే 9 నెలలు అత్యంత కీలకమని వ్యాఖ్య

jagan-serious-warning-to-party-mlas-on-party-tickets

అమరావతిః ఎమ్మెల్యేల మీటింగ్ లో సిఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పనితీరు బాగున్న ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తానని, పనితీరు బాగోలేని వారికి సీట్లు ఇవ్వలేనని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఎమ్మెల్యే గ్రాఫ్ పెంచుకోవాలని చెప్పారు. గ్రాఫ్ బాగోలేని వారిని కొనసాగించడం కుదరదని అన్నారు. గడపగడపకూ కార్యక్రమం వల్ల గ్రాఫ్ పెరుగుతుందని చెప్పారు. సర్వేల్లో అనుకూలంగా లేని వారిని కూడా కొనసాగించడం కుదరదని హెచ్చరించారు. ఇలాంటి వారికి టికెట్లు ఇవ్వడం వల్ల వారికీ నష్టం, పార్టీకి నష్టమని చెప్పారు. గడపగడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్షపై చర్చ సందర్భంగా ఆయన ఈ హెచ్చరికలు జారీ చేశారు.

వచ్చే 9 నెలలు అత్యంత కీలకమని జగన్ అన్నారు. జగనన్న సురక్షలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లాలని, ఈ కార్యక్రమాన్ని అందరూ ఛాలెంజింగ్ గా తీసుకోవాలని చెప్పారు. ఏయే పథకాలు ప్రజలకు అందలేదో తెలుసుకోవాలని ఆదేశించారు. వచ్చే సమావేశానికి పనితీరును మెరుగుపరుచుకుని రావాలని అన్నారు. పనితీరు బాగోలేని వారిని పిలిచి మాట్లాడతానని చెప్పారు. అందరూ కష్టపడి 175కి 175 సీట్లను గెలుచుకుందామని చెప్పారు.