దేశంలోని వెనకబడ్డ జిల్లాల అభివృద్ధిపై వీడియో కాన్ఫ‌రెన్స్

ప్రధాని నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో పాల్గొన్న జ‌గ‌న్

అమరావతి : దేశంలోని వెనకబడ్డ జిల్లాల అభివృద్ధిపై ప‌లు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, అధికారుల‌తో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. నీతి ఆయోగ్ ఆధ్వ‌ర్యంలో ఈ వీడియో కాన్ఫ‌రెన్స్ జ‌రిగింది. ఇందులో ఏపీలోని తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయం నుంచి ఏపీ సీఎం వైఎస్‌ జగన్ కూడా పాల్గొన్నారు. ప‌లు అంశాల ప్రగతిపై నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. సీఎంల‌కు మోడీ ప‌లు సూచ‌న‌లు చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/