సీఎం జగన్ బస్సు యాత్ర.. నేటి షెడ్యూల్

Seventh day Jagan memantha siddham yatra

సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఈరోజు పల్నాడు జిల్లా గంటవారిపాలెం నుంచి పుట్టావారిపాలెం, సంతమాగులూరు క్రాస్, రొంపిచర్ల క్రాస్, విప్పెర్ల, నెకరికల్లు మీదుగా దేవరంపాడు క్రాస్ వద్దకు చేరుకుంటారు. భోజనం అనంతరం కొండమోడు, పిడుగురాళ్ల బైపాస్ మీదుగా సా.3:30కి అయ్యప్పనగర్ వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత ధూళిపాళ్లలో బస చేస్తారు.

నిన్న ఉగాది సందర్బంగా యాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఆయ‌న స‌తీమ‌ణి వైయ‌స్‌ భార‌త‌మ్మ‌లు ఉగాది పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. శావల్యాపురం మండలం గంటావారిపాలెంలో శ్రీ క్రోధి నామ సంవత్సరం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలసి ఉగాది పూజా కార్యక్రమాల్లో ముఖ్య‌మంత్రి పాల్గొని ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. తెలుగు సంప్రదాయాలను పాటిస్తూ పంచాంగ శ్రవణ కార్యక్రమంతో పాటు వేదపండితులు ముఖ్యమంత్రి దంప‌తుల‌ను ఆశీర్వ‌దించారు. అనంతరం పండితులు అందించిన ఉగాది పచ్చడిని సీఎం దంపతులు స్వీకరించారు. కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.