నేడు గోదావరి జిల్లాల్లో చంద్రబాబు, పవన్ పర్యటన

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఉమ్మడిగా తణుకు, నిడదవోలులలో జరిగే బహిరంగ సభలకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు పాల్గొనబోతున్నారు.

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత ఉమ్మడి జిల్లాలో ఇద్ధరు నేతలు సంయుక్తంగా హాజరవుతున్న సభలు.. తణుకు నరేంద్ర సెంటర్‌లో సాయంత్రం నాలుగు గంటలకు, నిడదవోలులో రాత్రి ఏడు గంటలకు బహిరంగ సభలు నిర్వహిస్తారు. ఇద్దరు నేతలు నేరుగా తణుకుకు రెండు హెలికాఫ్టర్లలో చేరుకోనున్నారు. కాగా సభ అనంతరం చంద్రబాబు, పవన్ ఇద్దరు నేతలు రోడ్డు మార్గాన నిడదవోలు చేరుకోనున్నారు. సభ తరువాత చంద్రబాబు నాయుడు నిడదవోలులోనే రాత్రి బస చేస్తారు. కాగా నిడదవోలులో జరిగే సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి యంపీ అభ్యర్థి పురందేశ్వరి కూడా పాల్గొనబోతున్నారు.

రేపు డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తారు. సా. 4 గంటలకు అంబాజీపేట సభలో, రాత్రి 7కి అమలాపురం సభలో ప్రసంగిస్తారు. చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లు కలిసి ప్రచారం చేయడం తో రెండు పార్టీల శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.