‘బాషా’ మూవీ నిర్మాత కన్నుమూత

తమిళ్ చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ సినీ నిర్మాత ఆర్ఎం వీరప్పన్ (97) అనారోగ్యంతో కన్నుమూశారు. తమిళనాడు మాజీ సీఎం, దివంగత నటుడు ఎంజీఆర్ కు ఆయన సన్నిహితుడు.

ఎంజీఆర్, కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి అగ్ర హీరోలతో ఆయన పలు సినిమాలను నిర్మించారు. రజనీకాంత్ ‘బాషా’ మూవీకి కూడా నిర్మాతగా వ్యవహరించారు. ఈరోజు సాయంత్రం నుంగంబాకంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.