చేతిలో పేలిన సెల్ ఫోన్.. బాలికకు తీవ్ర గాయాలు

ప్రస్తుతం ఫోన్ వాడకం బాగా పెరిగింది. చిన్న పిల్లల దగ్గరి నుండి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరు సెల్ తోనే గడిపేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు యూట్యూబ్ వీడియోస్ బాగా అలవాటయ్యారు. లేచిన దగ్గరి నుండి పడుకునేవరకు అంత వాటిని చూస్తూ వస్తున్నారు. పిల్లల అల్లరిని తట్టుకోలేక తల్లిదండ్రులు సైతం ఫోన్లు వాళ్ళకే ఇస్తూ వారి వారి పనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొంతమంది పిల్లలు ఫోన్ ను ఛార్జింగ్ పెట్టి అలాగే వీడియోస్ చూడడం..ఆన్లైన్ గేమ్స్ ఆడుతుండడం తో పలు ప్రమాదాలు జరుగుతున్నాయి.

తాజాగా అలాంటి ప్రమాదమే జరిగింది. పల్నాడు (D) ఎమ్మాజీగూడెంలో 11 ఏళ్ల బాలిక వీరలక్ష్మి సెల్ ఫోన్ ను ఛార్జింగ్ పెట్టి వీడియోలు చూస్తుండగా అది ఒక్కసారిగా పేలింది. దీంతో వీరలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. బాలిక కుడి చేతి 2 వేళ్లు పూర్తిగా తెగిపోయాయి. పొట్ట భాగంలోనూ గాయాలయ్యాయి. తల్లిదండ్రులు వెంటనే బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం బాలిక క్షేమంగా ఉంది.