11 వ రోజుకు చేరుకున్న జగన్ ‘మేమంతా సిద్ధం’..ఈరోజు షెడ్యూల్ ఇలా

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం జగన్ తలపెట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నేటికీ 11 వ రోజుకు చేరుకుంది. మరికాసేపట్లో వెంకటాచలంపల్లి రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి జగన్ బయలుదేరి..ఆ తర్వాత సామజిక పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. బొదనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్డరోడ్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. చీకటిగల పాలెం మీదుగా వినుకొండ 3 గంటలకు చేరుకుని రోడ్ షో కార్యక్రమంలో పాల్గొంటారు. కనమర్లపూడి, శావల్యాపురం మీదుగా గంటావారిపాలెం రాత్రి బసకు చేరుకుంటారు. ఇక వినుకొండ శివయ్య స్తూపం వద్ద వైసీపీ ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు.

నిన్న కొనకనమిట్ల సభ లో జగన్ చంద్రబాబు ఫై నిప్పులు చెరిగారు. చంద్రబాబు.. నిమ్మగడ్డ రమేష్‌తో ఈసీకి ఫిర్యాదు చేయించి పెన్షన్లను అడ్డుకున్నారని ధ్వ‌జ‌మెత్తారు. చంద్రబాబు దారి అడ్డదారి.. పేదల భవిష్యత్‌ను అడ్డుకునేందుకు మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి. ప్రజల ఎజెండాతో మనం.. జెండాలు కట్టి వాళ్లు.. జగన్‌కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావు. ప్రజలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు’’ అంటూ సీఎం వైయ‌స్ జగన్‌ దుయ్యబట్టారు. వెన్నుపోట్లు, దగా, మోసం, అబద్దాలు, కుట్రలు చంద్రబాబు మార్క్‌ రాజకీయం. ఇంటింటికి అందుతున్న సంక్షేమాన్ని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమా?. మన అడుగులు ముందుకా.. వెనక్కా అని తేల్చే ఎన్నికలివి. చంద్రబాబుకు ఓటేస్తే జగన్‌ తెచ్చిన పథకాలకు ముగింపే. చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ పాతాళంలో ఉంటాయి’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.