మా ప్రభుత్వం ఫొటోస్ కు పోజులు ఇచ్చేరకం కాదు..సాయం చేసే రకం – జగన్

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి ఉప్పొంగి ప్రవహించింది. దీంతో పలు గ్రామాలుముంపుకు గురయ్యాయి. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ సోమవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. కూనవరం, వీఆర్ పురం మండలాల బాధిత గ్రామాల ప్రజలతో మాట్లాడి వారికీ అన్ని విధాలా సాయం అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వాల మాదిరి ఫోటోలకు పోజులు ఇచ్చే రకం కాదని , ఎప్పటికప్పుడు సహాయాన్ని అందించే టైపు అని జగన్ అన్నారు. తమ ప్రాంతాలకు ఎక్కడెక్కడ దెబ్బ తగిలి నష్టం జరిగిందో ఆ నష్టానికి సంబంధించి అన్ని వివరాలు కలెక్టర్ దగ్గర ఉన్నాయని, అందరికి సాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. అధికారులకు కావాల్సిన వనరులు ఇచ్చి వారం రోజులుల పాటు సహాయ కార్యక్రమాలకు ఏ మాత్రం అలసత్వం లేకుండా చేయాలని చెప్పామని వివరించారు.

కలెక్టర్లకు సదుపాయాలు ఇచ్చి, గ్రామ సచివాలయాల దగ్గర నుంచి వలంటీర్ల నుంచి యాక్టివేట్‌ చేశామన్నారు. వరద వచ్చినా ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా సహాయం అందించే కార్యక్రమాన్ని చూస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రజలు పిలిచిన వెంటనే ఎంతటి అధికారి అయినా వచ్చి మంచి చేసేందుకు తాపత్రయ పడే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అంటూ గొప్పగా చెప్పుకొచ్చారు. పోలవరం ముంపు బాధితుల పునరావాస ప్యాకేజీ పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు సీఎం జగన్ వివరించారు. పునరావాస ప్యాకేజీకి త్వరలోనే కేంద్రం ఆమోదం తెలుపుతుందన్నారు.