నేడు ఏపీకి రానున్న కేంద్ర బృందం

కేంద్ర బృందం నేడు ఏపీ రానున్నారు. మిచౌంగ్‌ తుఫాన్‌ దెబ్బకు ఏపీలోని పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంట నీటిపాలైందని , ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర బృందం రెండు రోజుల పాటు ఏపీలో పర్యటించి దెబ్బ తిన్న పంటపొలాలను పరిశీలించనున్నారు. తుఫాన్‌తో నష్టపోయిన పంటలను, ఇతర ఆస్తుల నష్టాన్ని అంచనా వేయనున్నారు.

తుఫాన్‌ ప్రభావిత జిల్లాల్లో జరిగిన పంట, ఇతర ఆస్తుల నష్టాన్ని అంచనా వేయడానికి ఈ రోజు రాష్ట్రానికి కేంద్ర బృందం రాబోతుందని.. నేడు కృష్ణా, బాపట్ల జిల్లాల్లో, రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేస్తారని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ అంబేద్కర్ వెల్లడించారు. సెంట్రల్‌ టీమ్‌.. రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో రెండు బృందాలుగా పర్యటించనున్నారు కేంద్ర బృందంలోని అధికారులు.. క్షేత్ర స్థాయి పరిశీలనతో పాటు.. తుఫాన్‌తో జరిగిన నష్టంపై ఆయా జిల్లాల అధికారుల నుంచి సమాచారం సేకరించనుంది.