జగన్ చిత్తుగా ఓడిపోతున్నారు – CPI నారాయణ

cpi-narayana

ఏపీ ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి చిత్తుగా ఓడిపోతున్నారని జోస్యం తెలిపారు CPI నారాయణ. గత ఐదేళ్లలో వైసీపీ నాయకులు చేయని పాపాలంటూ లేవని, కాబట్టి ప్రజలందరూ కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారని తెలిపారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయే పరిస్థితులో ఉందన్న నారాయణ.. అయితే అధికారులను నమ్మించేందుకు విశాఖలో ప్రమాణస్వీకారం అంటూ హడావిడి చేస్తున్నారని అన్నారు. విశాఖపట్నం హోటల్స్ గదులు ముందస్తు బుకింగ్‌తో నిండిపోయాయని వార్తలు వస్తున్నాయన్న నారాయణ.. తాను హోటల్స్‌కు ఫోన్ చేస్తే అలాంటిదేమీ లేదని తేలిందన్నారు.

కౌంటింగ్ గురించి కూడా వైసీపీ నేతలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని.. ఇవన్నీ చూస్తే వైసీపీ ఓడిపోతోందని తెలుస్తోందన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై రాజకీయంగా కక్ష పెంచుకున్నజగన్ ఆయనను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబీవీకి విధులు కేటాయించాలని సీఎస్ జవహర్‌రెడ్డికి తాను లేఖ రాశానని, పదవీ విరమణ రోజు ఆయనకు పోస్టింగ్ ఇవ్వడం సంతోషాన్నిచ్చిందని తెలిపారు. కేంద్రంలో బీజేపీకి 400 స్థానాలు రావని, ఎన్డీయేకు తగిన మద్దతు రాకపోతే ఆ కూటమి నుంచి బయటికి వచ్చే మొదటి వ్యక్తి చంద్రబాబేనని జోస్యం చెప్పారు.