భోళా శంకర్ నుండి వీడియో సాంగ్ లీక్..మేకర్స్ ఫై చిరు ఆగ్రహం

మెగాస్టార్ చిరంజీవి – మెహర్ రమేష్ కలయికలో తెరకెక్కుతున్న భోళాశంకర్ నుండి వీడియో సాంగ్ లీక్ అయ్యింది. వాల్తేర్ వీరయ్య తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న మెగా స్టార్ చిరంజీవి..అదే జోష్ తో భోళా శంకర్ షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. మెహర్ రమేష్ – చిరంజీవి కలయికలో తెరకెక్కుతున్న ఈ మూవీ వేదాళ‌మ్ రీమేక్‌గా వస్తుంది. ఈ మూవీ లో చిరంజీవి సోదరిగా కీర్తిసురేశ్‌ నటిస్తుండగా , తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమాను ఆగస్టు 11, 2023న విడుదల కాబోతుంది. ఈ తరుణంలో సినిమా ఫై భారీ అంచనాలతో ఉన్న అభిమానులు..సినిమా నుండి వీడియో సాంగ్ లీక్ కావడం తో అంత షాక్ అయ్యారు. ఇప్పటికే ఎన్నో సినిమాలు సైతం ఇలా లీక్ అయ్యి ఫోటోలు, వీడియోలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతూ ఉన్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ షూటింగ్ నుంచి ఫోటోలు మాత్రం లీక్ అవుతూనే ఉన్నాయి. కానీ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమా నుంచి ఏకంగా ఒక పాట క్లిప్ నెట్టింట వైరల్ గా మారుతోంది. లీకైన క్లిప్ లో తమన్నా, చిరంజీవి కలిసి డాన్స్ వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ గా మారుతోంది. ఈ లీక్ ఘటన ఫై చిరంజీవి ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్‌ కమర్షియల్స్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ మూవీ లో మురళీ శర్మ, రఘుబాబు, రావు రమేశ్‌, వెన్నెల కిశోర్‌, పీ రవి శంకర్‌, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, రష్మీ గౌతమ్‌, ఉత్తేజ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.