వాలంటీర్ల జీతాలను డబల్ చేయబోతున్న జగన్

ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం జగన్ వాలంటీర్లకు గుడ్ న్యూస్ తెలిపారు. ప్రస్తుతం ఇస్తున్న జీతాలను డబల్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం తరఫున సంక్షేమ పథకాలను లబ్దిదారుల ఇంటి వద్దకు చేరుస్తూ కీలకంగా మారిపోయిన వాలంటీర్లు గౌరవ వేతనాలతోనే పనిచేస్తున్నారు.

సాధారణంగా 5 వేల రూపాయల గౌరవ వేతనం మాత్రమే తీసుకుంటూ ఈ సేవలు చేస్తున్న వీరికి ప్రోత్సాహక అవార్డుల రూపంలో కొంత మొత్తాన్ని అందిస్తున్నారు. సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర పేరుతో మూడు కేటగిరీల్లో ఇస్తున్న ఈ అవార్డులకు అందించే మొత్తాన్ని రెట్టింపు చేయబోతోంది.

ప్రస్తుతం సేవా వజ్ర అవార్డు కింద వాలంటీర్లకు రూ.30 వేలు అందిస్తుండగా.. దాన్ని రూ.60వేలకు పెంచబోతున్నారు. అలాగే సేవా రత్న కింద రూ.20 వేలు అందిస్తుండగా.. దాన్ని ఇప్పుడు రూ.40 వేలకు పెంచనున్నారు. అలాగే సేవా మిత్ర కింద ఇస్తున్న రూ.10 వేల మొత్తాన్ని రూ.20 వేలకు పెంచాలని ప్రతిపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటికి అవసరమైన బడ్జెట్ ను కూడా రూ.250 కోట్ల నుంచి రూ.500 కోట్లకు పెంచనున్నారు.