భట్టి బడ్జెట్ ఫై సీఎం రేవంత్ అభినందనలు

Mallu Bhatti Vikramarka Telangana Assembly

తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి బడ్జెటన్‌ను శనివారం ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, శాసనసమండలిలో మంత్రి శ్రీధర్ బాబు 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ పద్దును ప్రవేశపెట్టారు.

ఈ బడ్జెట్ ఫై సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు. ఆర్థిక మంత్రి పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతనే బడ్జెట్​ను ప్రవేశపెట్టారని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను తాను అభినందిస్తున్నానన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ నిధులు వచ్చినా తీసుకుంటామని సీఎం రేవంత్​ రెడ్డి వివరించారు. కేంద్రాన్ని అదనంగా అడిగి కూడా నిధులు తెచ్చుకుంటామని స్పష్టం చేశారు. శాసనసభ సమావేశాలు పొడిగింపు తన చేతిలో లేదని సీఎం అన్నారు. ఈ విషయంలో స్పీకర్​ నిర్ణయం తీసుకుంటారని వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వం మాదిరి అబద్ధాల బడ్జెట్​ ప్రవేశపెట్టకుండా వాస్తవిక బడ్జెట్​ ప్రవేశపెట్టామని రేవంత్ అన్నారు. తమ ఎమ్మెల్యేలనే కాదు, ప్రతిపక్షాలనూ మేడిగడ్డకు తీసుకెళతామని స్పష్టం చేశారు. అనంతరం మేడిగడ్డ అక్రమాలపై న్యాయ విచారణ జరిపిస్తామని చెప్పారు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు.